పెట్టుబడులు ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నాయంటూ రాష్ట్ర ప్రభుత్వంపై కొన్ని పత్రికలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. ఎల్లో మీడియాలో ఆ రాతలు సిరాతో రాసినవా.. లేక.. సారా తాగి రాసిన రాతలా..?. సిరాకు ఉన్న గొప్ప శక్తి ఎటువంటిదో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. రాజకీయంగా ఎవరినో తీసుకొచ్చి పైన కూర్చోబెట్టడం కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడతారా..? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరరాజా ప్రతినిధులు ఇతర ప్రాంతాల్లో పెట్టుబడులు పెడితే ఇక్కడి నుంచి వెళ్లిపోయినట్లా అని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని ఏదో రకంగా బద్నాం చేయాలని ఎల్లోమీడియా ప్రయత్నిస్తోందని అన్నారు. ఎల్లోమీడియా ఎన్ని జాకీలు పెట్టినా చంద్రబాబు లేవలేరన్నారు. చంద్రబాబుకు చెందిన హెరిటేజ్ వ్యాపారం ఏపీలో ఉందని, ఈ మూడున్నరేళ్లలో ప్రభుత్వం ఏనాడైనా ఇబ్బంది పెట్టిందా?. అని ప్రశ్నించారు. పారిశ్రామిక వేత్తలకు ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు.