బాపట్ల జిల్లా, భట్టిప్రోలు మండల పరిధిలోని ఆళ్ళమూడి గ్రామం ఎస్సి కాలనిలో గురువారం రాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో గ్రామానికి చెందిన నీలా మునిమ్మ కు చెందిన పూరిల్లు అగ్నికి ఆహుతి అయింది. ఈ క్రమంలో సోమవారం కార్తీక్ ఫౌండేషన్, ఫౌండర్ నండూరి కార్తీక్ బాధితురాలిని పరామర్శించి, అగ్నిప్రమాద బాధిత కుటుంబానికి దాతల సహకారంతో 10, 000 రూపాయలు విలువగల వంటసామాన్లు, నిత్యావసర సరుకులు, బియ్యం, కూరగాయలు, దుస్తులు అందించారు. ఈ సందర్భంగా సంస్థ ఫౌండర్ కార్తీక్ మాట్లాడుతూ ఎక్కడ ఎవరికి అపద అని తెలిసిన కార్తీక్ ఫౌండేషన్ సహాయం అందిస్తుందని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో పాంతగాని బాలు, పాంతగాని ప్రవీణ్ కుమార్, కార్తీక్ ఫౌండేషన్ టీం సబ్యులు తదితరులు పాల్గొన్నారు.