తన భార్యను హెలికాఫ్టర్ లో తన ఇంటికి తీసుకెళ్లి వార్తల్లోకెక్కాడో వరుడు. ఉత్తరప్రదేశ్ లోని చావ్ మండీకి చెందిన సంజయ్ కుమార్ కుమారుడి వివాహం బిజ్నోర్ జిల్లాకు చెందిన నేహా ధీమాన్ తో నిశ్చయమైంది. డిసెంబర్ 2 న బిజ్నోర్ చాంద్ పూర్ లో వీరిద్దరి వివాహం జరిగింది. కాగా, వివాహం అనంతరం నవ వధువును వరుడు తన ఇంటికి హెలికాఫ్టర్ లో తీసుకొచ్చాడు. దీంతో చావ్ మండి ప్రాంతంలో సందడి నెలకొంది. హెలికాఫ్టర్ ను చూసేందుకు స్థానికులు అక్కడికి పోటెత్తారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa