గుజరాత్ రాష్ట్రం జునాఘడ్ పట్టణానికి చెందిన రఫీక్, మెహమూదాలు భార్యభర్తలు. కాగా, మెహమూదాకు ఆసిఫ్ చౌహాన్ అనే వ్యక్తితో 8 నెలలుగా అక్రమ సంబంధం ఏర్పడింది. ప్రియుడ్ని పెళ్లి చేసుకునేందుకు భర్తను హత్య చేయాలని మెహమూదా పథకం పన్నింది. దీంతో ఇమ్రాన్ అనే వ్యక్తితో సెనైడ్ తెప్పించి శీతలపానీయంలో కలిపి రఫీక్ ఆటోలో పెట్టారు. అది తాగిన రఫీక్, అతని స్నేహితుడు భరత్ అలియాస్ జోహాన్ లు స్పృహ తప్పి మరణించారు. కల్తీ మద్యం తాగడం వల్ల మరణించినట్లు ప్రాథమికంగా అనుమానించిన పోలీసులు తర్వాత హత్యను ఛేదించారు. ఈ కేసులో నిందితులైన మెహమూదా, ఆసిఫ్, ఇమ్రాన్ లను పోలీసులు అరెస్టు చేశారు.