దేశంలో సహజ వాయువు ఉత్పత్తి ధరలపై కేంద్రానికి కీలక సూచనలు చేసిన కిరీట్ పారిఖ్ కమిటీ, ONGC ఆయిల్ ఇండియాకు కొంత ఊరట కల్పించింది. ఈ సంస్థలకు ప్రభుత్వం నామినేషన్‌పై కేటాయించిన లెగసీ ఫీల్డ్స్ నుంచి ఉత్పత్తి చేసే గ్యాస్ ధరను.. దిగుమతి చేసుకునే ధరలో 10% నిర్ణయించాలని పేర్కొంది. అలాగే, ఇవే సంస్థలు కొత్తగా ఉత్పత్తి చేసే గ్యాస్‌కు 20% అధిక ధరను పారిఖ్ కమిటీ సూచించింది. ఇక లెగసీ క్షేత్రాల నుంచి ఉత్పత్తి చేసే ధరను దిగుమతి ధరలో 10 శాతం లేదా MBTU గ్యాస్‌కు గరిష్టంగా 6.5 డాలర్లు మించకూడదని పేర్కొంది. అదే సమయంలో కనిష్టంగా 4 డాలర్లను సిఫారసు చేసింది. దీనివల్ల ఎరువుల కంపెనీలపై భారం తగ్గనుంది.