ఎయిడ్స్‌ను నయం చేసే చికిత్స ఏదీ లేదు. కానీ నియంత్రణలో ఉండే చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. టీకాల తయారీ కష్టమైన హెచ్‌ఐవీ వంటి వైరస్‌ల నుంచి విముక్తి కల్పించేందుకు స్క్రిప్ట్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ పరిశోధకులు ముందగుడు వేశారు. వినూత్న జెర్మ్‌లైన్ టార్గెటింగ్ పరిజ్ఞానంతో సరికొత్త టీకాను రూపొందించారు. ఇది మనుసుల్లో 97 శాతం వరకు పనిచేయడం గమనార్హం. ఈ టీకా పరిజ్ఞానాన్ని ప్లూ, హైపటైటిస్ సి, కరోనా వైరస్‌లకు వాడుకోవచ్చు.