ఏపీలోని గుంటూరు జిల్లాలో సోమవారం దారుణం జరిగింది. పెదకాకాని మండలంలోని తక్కెళ్లపాడులో తపస్వి అనే ఎంబీబీఎస్ విద్యార్థినిపై జ్ఞానేశ్వర్ అనే యువకుడు సర్జికల్ బ్లేడ్ తో దాడి చేశాడు. తీవ్రగాయాలపాలైన తపస్వి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. తపస్విపై దాడి చేసిన తర్వాత జ్ఞానేశ్వర్ తన చేయి కోసుకున్నాడు. ప్రస్తుతం నిందితుడు పెదకాకాని పోలీసుల అదుపులో ఉన్నాడు. విజయవాడకు చెందిన నిందితుడు జ్ఞానేశ్వర్ కు, తపస్వికి రెండేళ్ల క్రితం పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఇటీవల వారి మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో తపస్విపై ఆగ్రహంతో ఉన్న జ్ఞానేశ్వర్ ఆమెను గొంతు కోసి చంపాడు.