2021-22 సంవత్సరం కి గాను దేశంలో డ్రగ్స్‌ని అత్యధిక స్థాయిలో ఆంధ్రలోనే స్వాధీనం చేసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) ‘స్మగ్లింగ్ ఇన్ ఇండియా’ పేరుతో తయారుచేసిన నివేదికను సోమవారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఢిల్లీలో విడుదల చేశారు. ఆ నివేదిక ప్రకారం కేంద్ర రిజర్వు పోలీసు బలగాలు (సీఆర్పీఎఫ్) 2021-22 సంవత్సరంలో అత్యధికంగా ఏపీలో 18,267.84 కిలోలు, ఆ తర్వాత త్రిపురలో 10,104.99 కిలోలు, అస్సోంలో 3,633.08 కిలోలు, తెలంగాణలో 1,012.04 కిలోలడ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నాయి. బ్రౌన్ షుగర్, హెరాయిన్, ఓపియం, మార్ఫిన్, గంజాయి వంటివి వీటిలో ఉన్నాయి. వీటికి సంబంధించి ఆంధ్రలో 90 మందిని, తెలంగాణలో ఐదుగురిని కేంద్ర బలగాలు అరెస్టు చేశాయని పేర్కొంది.