ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రభుత్వానికి ఎలాంటి బాధ్యతను అప్పగించిన సిద్ధం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Dec 06, 2022, 12:38 PM

జి-20 దేశాల సదస్సు కోసం చేసే ఏర్పాట్లు, దానికోసం జరిగే సన్నాహకాల్లో ఎలాంటి బాధ్యతను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించినా నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నామని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అన్నారు. ఈ ప్రతిష్టాత్మక సదస్సు విజయవంతం కావడానికి అన్నిరకాలు తాము సహాయ సహకారాలు అందిస్తామన్నారు.  వచ్చే ఏడాది భారత్‌లో జరగనున్న జి-20 దేశాధినేతల ప్రతిష్టాత్మక సదస్సుకు భారత్‌ వేదిక కావడం పట్ల సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సంతోషం వ్యక్తంచేశారు. ఈ విషయంలో ప్రధాని మోదీకి ఆయన అభినందనలు తెలియజేశారు. జి-20 సదస్సు సన్నాహకాలు, వ్యూహాల ఖరారులో భాగంగా ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లోని అశోకా హాలులో సమావేశం నిర్వహించారు. సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా సమావేశంలో సీఎం మాట్లాడారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com