జయహో బీసీ.. నినాదం చంద్రబాబు అబ్బసొత్తు కాదని వైయస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. బలహీనవర్గాల ఆత్మగౌరవం, సామాజిక న్యాయమే లక్ష్యంగా ‘జయహో బీసీ మహాసభ – వెనుకబడిన కులాలే వెన్నెముక’సభను వైయస్ఆర్సీపీ ఈ నెల 7వ తేదీన ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహిస్తుందని తెలిపారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈనెల 7న నిర్వహించనున్న‘జయహో బీసీ మహాసభ’ఏర్పాట్లను బీసీ సభ కో-ఆర్డినేషన్ కమిటీ సభ్యులు, పార్టీ రాష్ట్ర కో ఆర్డినేటర్, రాజ్యసభ సభ్యులు వి. విజయసాయిరెడ్డి, రాష్ట్ర మంత్రులు బొత్స సత్యనారాయణ, కారుమూరి నాగేశ్వరరావు తదితరులు పరిశీలించారు. అనంతరం విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు.