రైతులకు కనీస మద్దతు ధర కన్నా.. ఒక్కపైసా తగ్గకూడదని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. రైతులకు మద్దతు ధర రావాలనే ఉద్దేశంతో కొత్త విధానానికి శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. ఇందు కోసం ధాన్యం సేకరణలో తొలిసారిగా మిల్లర్ల ప్రమేయాన్ని తీసివేశామన్నారు. ఖరీప్ ధాన్యం సేకరణ, ఇతర పంటలపై వ్యవసాయ, పౌరసరఫరాలశాఖలతో క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్.జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మిల్లర్ల ప్రమేయంలేకుండా సేకరిస్తున్న కొత్త విధానం అమలు తీరును సీఎం వైయస్ జగన్ సమగ్రంగా సమీక్షించారు. ఈ మేరకు అధికారులకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ పలు ఆదేశాలు ఇచ్చారు.