హిందూపురం వైసీపీ ఎమ్మెల్యే గోరంట్ల మాధవ్‌కు చేదు అనుభవం ఎదురైంది. హిందూపురం మున్సిపల్ కార్యాలయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించేందుకు మాధవ్ అక్కడికి వచ్చారు. కానీ కార్యక్రమానికి ఎమ్మెల్సీ రాకపోవడంతో విగ్రహావిష్కరణ కార్యక్రమం నిలిచిపోయింది. దీంతో గోరంట్ల మాధవ్ ను దళిత సంఘాల నాయకులు నిలదీశారు. ఎమ్మెల్సీ రాకపోతే విగ్రహావిష్కరణ కార్యక్రమం వాయిదా పడుతుందా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మాధవ్ వారిని ఒప్పించే ప్రయత్నం చేసినా వారు వినలేదు. అందుకే విగ్రహాన్ని ఆవిష్కరించకుండా పూలమాల వేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు.