భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 66వ వర్ధంతిని పురస్కరించుకుని మంగళవారం గుంతకల్లు పట్టణంలోని రాజకీయ పార్టీలు, దళిత సంఘాలు, ఏపి ఎరు కుల సేవా నాయకులు మున్సిపల్ కార్యాలయం సమీపంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పిం చారు. ఈ సందర్బంగా ఎరుకుల పట్టణ సంఘం అధ్యక్షుడు గురు గుంట్ల ప్రభాకర్ మాట్లాడుతూ భారతదేశం ఉన్నంతకాలం డాక్టర్ అంబేద్కర్ అనే పదం అంతర్లీనంగా ధ్వనిస్తూనే ఉంటుందన్నారు. ఆయన వ్రాసిన రాజ్యాంగం రూపంలో అంత ర్వాహినిలా ప్రవహిస్తూనే ఉంటుంద న్నారు. అందుకే అంబేద్కరునికి వర్ధంతి ఉంటుందేమో కానీ మరణం ఉండదన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు వై బసప్ప, వై. తిమ్మ ప్ప, యం. వరప్రసాద్, దోసలుడికి మల్లికార్జున, లోకేష్, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.