ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ రేపు విజయవాడ, నెల్లూరులో పర్యటించనున్నారు. విజయవాడ మున్సిపల్ స్టేడియంలో రేపు 'జయహో బీసీ' సభ జరగనుండగా, ఉదయం 11.50 గంటలకు సీఎం జగన్ సభకు హాజరుకానున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ సమావేశంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గంటలకు నెల్లూరు నుంచి బయలుదేరుతారు. మధ్యాహ్నం 3.25 గంటలకు నెల్లూరు రూరల్ మండలం కనపర్తిపాడు చేరుకుంటారు. సూళ్లూరుపేట ఎమ్మెల్యే సంజీవయ్య కుమార్తె వివాహ రిసెప్షన్‌లో పాల్గొననున్నారు. స్థానిక వీపీఆర్ కన్వెన్షన్‌లో రిసెప్షన్ జరగనుంది. రేపు సాయంత్రం 6.20 గంటలకు తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa