రెవెన్యూ యంత్రాంగానికి ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏదైనా భూమికి సంబంధించి వివాదం తలెత్తితే వివాదాస్పద భూమినే వివాద రిజిస్టర్ లో ఉంచాలని, ఆ సర్వే నంబర్ మొత్తాన్ని నమోదు చేయొద్దని స్పష్టం చేసింది. ఇప్పటికే మొత్తం సర్వే నంబర్ ను వివాద రిజిస్టర్ లో పెట్టిన కేసులపై తహశీల్దార్లు వెంటనే స్పందించి, ప్రభుత్వ ఆదేశాలను పక్కాగా అమలు చేయాలని ఆదేశించింది. కలెక్టర్లు కూడా దీనిపై ఆర్డీఓలు, తహశీల్దార్లకు స్పష్టమైన ఆదేశాలిచ్చి అమలయ్యేలా చూడాలని సర్క్యులర్ జారీ చేసింది.