బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మాండూస్ తుఫానుగా బలపడనున్న విషయం తెలిసిందే. అయితే ఈ తుఫానును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి వెల్లడించారు. నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, అనంతపురం జిల్లాలపై తుఫాను ప్రభావం ఉంటుందని తెలిపారు. అత్యవసర సాయం, సమాచారం కోసం టోల్ ఫ్రీ నెంబర్ 18004250101 నెంబర్ కు ఫోన్ చేయాలని సూచించారు. ఏటిగట్లు, రిజర్వాయర్లకు గండ్లు పడకుండా ముందస్తు చర్యలు చేపట్టామని తెలిపారు. సముద్రంలో వేటకు వెళ్లిన జాలర్లు వెంటనే తిరిగి రావాలని ఆయన సూచించారు.