హిమాచల్‌ప్రదేశ్‌లో ఈ సారి హంగ్ ఏర్పడే అవకాశాలున్నాయన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాల నేపథ్యంలో ఇండిపెండెంట్లపై బీజేపీ గురిపెట్టింది. వారిని తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. స్వతంత్ర అభ్యర్థులకు ప్రలోభాల వల విసురుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. మొత్తం 68 అసెంబ్లీ సీట్లున్న హిమాచల్‌ప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే కనీసం 35 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండాలి. ఈ సారి అధికార బీజేపీగానీ, ప్రతిపక్ష కాంగ్రెస్ గానీ ఈ మార్కును అధిగమించకపోవచ్చని ఎగ్జిట్ పోల్స్ సూచిస్తున్నాయి.