సహజీవనం, వివాహేతర సంబంధాలను నేరంగా పేర్కొంటూ ఇండోనేషియా ప్రభుత్వం చట్టంలో మార్పలు చేసింది. సవరించిన నేర శిక్షాస్మృతి బిల్లును ఆ దేశ పార్లమెంట్ ఆమోదించింది. ఈ చట్టం ప్రకారం వివాహేతర సంబంధానికి ఏడాది జైలు శిక్ష విధిస్తారు. సహజీవనం చేస్తే ఆరు నెలల వరకు శిక్ష వేస్తారు. అబార్షన్, దైవ దూషణలను ఇకపై నేరంగా పరిగణిస్తారు. దేశాధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కేంద్ర ప్రభుత్వ సంస్థలను విమర్శించడాన్ని నిషేధించారు.