ప్రకృతిలో విహరిస్తే ఆయు:ప్రమాణం పెరగడం, మానసిక ఆరోగ్యం మెరుగవడం వంటి ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని ఐఎస్‌గ్లోబల్ చేపట్టిన తాజా అధ్యయనంలో వెల్లడైంది. మెరుగైన ప్రజారోగ్యం కోసం ఎంత గ్రీన్ స్పేస్ ఉండాలనే దానిపై ఈ అధ్యయనం స్పష్టత నిచ్చింది. 3-30-300 గ్రీన్ స్పేస్ రూల్‌ను పాటించాలని పేర్కొంది. ప్రతి ఒక్కరూ తమ ఇంటి నుంచి కనీసం మూడు చెట్లను చూడాలని, వారు నివసించే ప్రదేశంలో 30 శాతం చెట్లు నిండిఉండాలని, సమీప పార్క్ లేదా గ్రీన్ స్పేస్‌కు 300 మీటర్ల లోపే నివాసం ఉండాలని పేర్కొంది. ఈ పచ్చని పరిసరాల్లో విహరిస్తే కుంగుబాటు, ఆందోళనకు చెక్ పెట్టొచ్చని వివరించింది.