ప్రముఖ పర్యాటక దేశం స్విట్జర్లాండ్ విద్యుత్ కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతోంది. విద్యుత్ కొరత ప్రభావం ప్రజలపై పడుతోంది. ఈ నేపథ్యంలో భవిష్యత్ విద్యుత్ అవసరాలపై అక్కడి ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ క్రమంలోనే విద్యుత్ వినియోగంపై పలు ఆంక్షలు విధించేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. దేశంలో వేడుకలు, థియేటర్ ప్రధర్శనలు, క్రీడా కార్యక్రమాలను నిషేదించేందుకు ప్రభుత్వం ముసాయిదాను రూపొందిస్తోంది. దీంతో పాటు ఈవీలను సైతం అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే వాడుకునే విధంగా ఆంక్షలు విధించేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు సమాచారం.