ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జగనన్న కాలనీలో ప్రభుత్వమే ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ధర్నా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Dec 07, 2022, 12:08 PM

లబ్ధిదారులకు వెంటనే టిడ్కో ఇళ్లను కేటాయించాలని, జగనన్న కాలనీలో ప్రభుత్వమే ఇళ్లు నిర్మించి ఇవ్వాలని సీపీఐ ఆధ్వర్యంలో మంగళవారం కృష్ణా జిల్లా,తిరువూరు  మున్సిపల్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. జిల్లా కార్యవర్గం సభ్యుడు తూము కృష్ణయ్య, పట్టణ కార్యదర్శి కొత్తపల్లి సుందరావులు మాట్లాడుతూ..... , టీడీపీ ప్రభుత్వ హ యంలో టిడ్కో ఇళ్లకు సంబంధించి లబ్ధిదారులు తమ వాటా నగదు చెల్లించారు. బ్యాంకులు రుణం చెల్లించాలని లబ్ధిదారులకు నోటీలు జారీ చేస్తున్నాయన్నారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని మున్సిపల్‌ కార్యాలయం మేనేజర్‌ త్రినాథ్‌కు అందజేశారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com