భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాష్ట్రంలో పర్యటించనున్న విషయం తెలిసిందే. అయితే ఆయన ఒకరోజు ముందుగానే రాష్ట్రానికి రానున్నట్లు తెలుస్తోంది. బండి సంజయ్ పాదయాత్ర ముగింపు సందర్భంగా కరీంనగర్ లో జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. తొలుత బహిరంగ సభ ఈ నెల 16న నిర్వహించాలని భావించగా, అదే రోజు నడ్డా రావాల్సి ఉంది. కానీ యాత్ర ముగింపు సభను 15 వ తేదీకి మార్చారు. దీంతో జేపీ నడ్డా ఒకరోజు ముందుగానే రాష్ట్రానికి రానున్నారు.