శీతాకాలంలో మంచు కారణంగా రైళ్లు ఆలస్యం కాకుండా వాటి గరిష్ట వేగ పరిమితి పెంచాలని రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. రైళ్ల గరిష్ట వేగపరిమితిని 60 కి.మీ నుంచి 70 కి.మీ. లకు పెంచాలని నిర్ణయించింది. మంచు ప్రభావిత ప్రాంతాల్లో నడిచే రైళ్ల ఇంజన్లలో ఉండే ప్రత్యేక పరికరాలతో ఇది సాధ్యమవుతుందని తెలిపింది. లోకోపైలెట్లను మరింత అప్రమత్తం చేయాలని, సూచికలు స్పష్టంగా కనిపించేలా చర్యలు తీసుకోవాలని రైల్వే జోన్లను ఆదేశించింది. చివరి బోగీ వెనకాల సాధారణ ఎర్ర లైట్లకు బదులు, ఎల్ఈడీలను అమర్చాలని సూచించింది.