భారత్ లో ఫెమీనా మిస్ ఇండియా- 2023 పోటీలు మణిపూర్ వేదికగా జరగనున్నాయి. దేశంలోని ఏ ప్రాంతానికి చెందిన అమ్మాయిలైనా ఈ పోటీలలో పాల్గొనవచ్చు. ఈ పోటీలకు సంబంధించిన ప్రకటన తాజాగా వెలువడింది. 30 మందితో తుది జాబితా తయారు చేసి ఫెమీనా మిస్ ఇండియా పోటీలను నిర్వహిస్తారు. ఈ పోటీల్లో పాల్గొనే వారి వయస్సు 18 నుంచి 25 ఏళ్ల లోపు ఉండాలి. హీల్స్ లేకుండా ఎత్తు 5.3 అడుగులు ఉండాలి. బరువు 51 కేజీలకు మించకూడదు. పెళ్లి, నిశ్చితార్థం జరిగి ఉండరాదు. గతంలో పెళ్ళి చేసుకుని విడిపోయినా అనర్హులే. భారతీయులకే అవకాశం ఉంటుంది. పాస్ పోర్టు కలిగి ఉండాలి. ఆసక్తి ఉన్న వారు www.missindia.com వెబ్ సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.