తెలుగుదేశం గెలుపే లక్ష్యంగా పని చెయ్యాలని పార్టీకి నష్టం కలిగించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని మాజీ మంత్రి పల్లెకు టీడిపి అధినేత చంద్రబాబు బుధవారం దిశానిర్దేశం చేశారు. వన్ టూ వన్ కార్యక్రమంలో భాగంగా అధినేతతో సమావేశం అయిన మాజీ మంత్రి పల్లె రానున్న ఎన్నికల్లో పుట్టపర్తి గడ్డ పై తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేయడానికి అన్ని విధాల సమాయత్తం కావాలని మాజీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డికి తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ఇంచార్జిలతో వన్ టూ వన్ కార్యక్రమంలో భాగంగా బుధవారం విజయవాడలోని చంద్రబాబు నివాసంలో మాజీమంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా నియోజకవర్గంలో చేపడుతున్న పార్టీ కార్యక్రమాలను పల్లె రఘునాథ్ రెడ్డి ఆయన అంశాల వారీగా వివరించారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం తీసుకుంటున్న చర్యలు, సభ్యత్వ నమోదు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గెలుపుపై తీసుకుంటున్న నిర్ణయాలను మరియు ప్రస్తుతం జరుగుతున్న ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం సంబందించిన అంశాలను టీడీపీ అధినేత చంద్రబాబుకు మాజీమంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి వివరించారు.
ఈ సందర్భంగా పుట్టపర్తి నియోజకవర్గంలో బాదుడే బాదుడు, గౌరవ సభలతో పాటు నిరసన దీక్షలు సమర్థవతంగా నిర్వహించారని, ఇదే తరహాలో ఇదేం ఖర్మ - మన రాష్ట్రానికి కార్యక్రమం కూడా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ప్రజలకు అందిస్తున్న ఆర్ధిక సహాయంపై పల్లె రఘునాథ్ రెడ్డిని అధినేత ప్రశంసించారు. రానున్న ఎన్నికల సమయం చాలా కీలకమైనది , అవి ఎప్పుడు వచ్చినా సరే ఎదుర్కొనే కార్యకర్తలను సంసిద్ధం చేయాలని చంద్రబాబు పేర్కొన్నారు. నియోజకవర్గంలో మరింతగా ప్రజల్లోకి వెళ్లి వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాడాలని సూచించారు.
పార్టీకి పని చేసేవారికి పెద్ద పీట వేస్తామని ఖరా ఖండిగా నియోజకవర్గ నాయకులకు మెసేజ్ ఇవ్వాలని చంద్రబాబు మాజీ మంత్రికి సూచించారు. పార్టీ విషయంలో మెత్తగా ఉండవద్దని , మరింత కఠినంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. పుట్టపర్తి నియోజకవర్గం టీడీపీకి కంచుకోటలాగా ఉందని , దాని వచ్చే ఎన్నికల్లో చేతల్లో చూపించాలని మాజీ మంత్రి కి వెల్లడించారు. ఎన్నికల సమరం ఉందనే విధంగా గ్రామాల్లో ప్రజల సమస్యలపై దృష్టి సారించి పోరాటం చేయాలని ఆయన పల్లెకు సూచించారు.