ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ నెల్లూరులో పర్యటించారు. విజయవాడలో జరిగిన జయహో బీసీ సభలో ఆయన పాల్గొని కార్యక్రమం ముగించుకుని నెల్లూరు రూరల్ మండలం కనపర్తిపాడు వెళ్లారు. సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య కుమార్తె సౌజన్య వివాహ వేడుకకు హాజరయ్యారు. కనపర్తిపాడులోని వీపీఆర్ సమావేశ మందిరంలో వివాహ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సౌజన్య, డాక్టర్ శ్రవణ్ కుమార్లకు వధూవరులుకు శుభాకాంక్షలు తెలిపారు.