ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో బుధవారం కె. జయశంకర్ కళాజాత బృందం బి. మఠం మండలం బస్టాండ్ సెంటర్ వద్ద ఆధునిక కళాజాత వీధి నాటకం ద్వారా హెచ్. ఐ. వి ఎయిడ్స్ నివారణపై ప్రజలకు అవగాహన కల్పించారు. హెచ్. ఐ. వి నాలుగు మార్గాల ద్వారానే వస్తుందని సురక్షితం కాని లైంగిక సంబంధాలు, కలుషిత రక్తాలు, హెచ్ఐవి సోకిన తల్లి నుండి బిడ్డకు, సురక్షితం కానటువంటి బ్లేడ్లు, సిరంజీలు ద్వారా సోకే అవకాశం ఉందని వివరించారు. ఇక ఏ రకంగానూ హెచ్ఐవి ఒకరి నుంచి ఒకరికి సోకదని, అలాగే హెచ్ఐవి పైన అనుమానం కలిగిన వ్యక్తుల కోసం టోల్ ఫ్రీ నెంబర్ 1 097 నంబర్ను ప్రవేశపెట్టడం జరిగింది. ఇది అన్ని భాషల్లో పని చేస్తుంది 24 గంటల్లో పనిచేస్తుంది.
ఎటువంటి ఖర్చు లేదు, హెచ్ఐవి బాధితులకు భారత ప్రభుత్వము హెచ్ఐవి యాక్ట్ చట్టం 2017 ను ప్రవేశపెట్టారు. దీని ద్వారా హెచ్ఐవి బాధితులకు రక్షణ కల్పించినట్లుగా వారు కూడా సమాజంలో అందరి మాదిరిగానే జీవించే విధంగా ఈ చట్టం ఉపయోగించబడుతుందని కళాజాత బృందం అవగాహన పాటల ద్వారా, నాటికల ద్వారా, ఇంద్రజాల మహేంద్రజాలం ద్వారా ఆకట్టుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాజాత బృందము కె. జయ శంకర్, వై. సుధాకర్, ఎం. రాఘవేంద్రబాబు, కె. జయరామయ్య, పి. సుబ్రహ్మణ్యం, ఈశ్వరయ్య, లింక్ వర్కర్స్ స్కీమ్ దర్బార్ రమణ, ఆశా కార్యకర్తలు, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.