వైఎస్ఆర్సీపి ఆధ్వర్యంలో బుధవారం జరిగిన జయహో బీసీ మహాసభ విజయవంతంగా ముగిసినట్లు వేంపల్లె మండలం వైఎస్ఆర్సీపి యూత్ కన్వీనర్ కె. రవిశంకర్ గౌడ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వేంపల్లె మండలం నుంచి పెద్ద ఎత్తున బీసీ ఎంపిటిసిలు, సర్పంచులు, వార్డు సభ్యులు బీసీ మహాసభలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సారధ్యంలో వెనుకబడిన కులాలను వెన్నుముకగా మార్చిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందన్నారు. బీసీలలోని మొత్తం 139 కులాలను ఒకేచోట చేరడం. అందులో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహించడం ఎంతో శుభపరిణామం, సంతోషదగ విషయమన్నారు. అలాగే బీసీ కులాలకు అత్యధిక రాజకీయ ప్రాధాన్యత కల్పించిన గొప్ప నేతగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కొనియాడారు. బీసీల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ. 56 బీసీ కార్పొరేషన్ల ద్వారా నిధులు, పదవులు, సముచిత స్థానం కల్పించి, నేడు సమాజంలో బీసీ కులాలను తలెత్తుకుని జీవించేలా చేశారన్నారు. బీసీల తోకలు కత్తరిస్తామంటూ. బీసీల పట్ల అవహేళనగా మాట్లాడిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఆయన మండిపడ్డారు. ఎప్పటికి, ఎన్నటికీ బీసీ కులాలందరూ వైఎస్సార్‌సీపీ కీ అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపిఎండిసి డైరెక్టర్ సల్మా, వైఎస్సార్‌సీపీ ప్రజా ప్రతినిధులు బి. భారతీ, నరసింహ గౌడ్, గంగరాజు, బ్రహ్మయ్య, శేషాద్రి, గణేష్, సురేంద్ర, షుకూర్, బికారి, సునీల్, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.