సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో పులివెందుల పట్టణం ఎంఆర్సి కార్యాలయ ఆవరణలో బుధవారం ఏర్పాటుచేసిన దివ్యాంగుల ఉపకరణాల నిర్ధారణ శిబిరానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కేశవరెడ్డి, జిల్లా ప్లానింగ్ కోఆర్డినేటర్ లక్ష్మీ నరసింహ రాజుతో కలిసి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. రెవెన్యూ డివిజన్ పరిధిలోని అన్ని మండలాలకు సంబంధించిన భవిత స్కూల్స్ రిసోర్సు ఉపాధ్యాయులు, స్పెషల్ ఎడ్యుకేటర్స్ తమ పరిధిలోని ప్రత్యేక అవసరాలు గల పిల్లలందరినీ శిబిరానికి తీసుకొని వచ్చి సంబంధిత వైద్య నిపుణులచే పరీక్షలు నిర్వహించి అర్హులను గుర్తించారు. ప్రభుత్వం నుండి సహాయ పరికరాలు మంజూరైన వెంటనే, లబ్ధిదారులకు ఉపకరణాలను అందజేస్తామని అధికారులు పేర్కొన్నారు.
కడప రిమ్స్ వైద్యశాల నుండి హాజరైన డాక్టర్ లక్ష్మీ ప్రసాద్ రెడ్డి ఎముకలు కీళ్ల వైద్యనిపుణులు, డాక్టర్ బాల గుర్రప్ప, ఈ ఎన్ టి , డాక్టర్ అనంతరెడ్డి ఆడియాలజీ , డాక్టర్ గీతిక కంటి వైద్య నిపుణురాలు, డాక్టర్ శ్రీలేఖ స్పీచ్ థెరపీస్ట్, తదితరులు హాజరై సుమారు 150 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి బండి వీరారెడ్డి , వికలాంగుల నెట్ వర్క్ అధ్యక్షుడు ఇరికిరెడ్డి రఘునాథరెడ్డి, జిల్లా ప్లానింగ్ కోఆర్డినేటర్ లక్ష్మీనరసింహారాజు వివిధ మండలాల ప్రత్యేక విద్యా బోధకులు ప్రకాశమ్మ , స్వాతి, యశోద , రాంబాబు, సుజాత , లక్ష్మీ ప్రసన్న, విజయలక్ష్మి , షాహిద్, ఫిజియోథెరపిస్టులు పాలేటి, సుధీర్ కుమార్, కేర్ టేకర్ అరుణ తదితరులు పాల్గొన్నారు.