ఈరోజు ఉక్కు ఐక్యవేదిక మీడియా సమావేశం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. వివిధ రాజకీయ పార్టీ నాయకులు ప్రజాసంఘాల నాయకులు మాట్లాడుతూ. ఉక్కు ఐక్యవేదిక ఆధ్వర్యంలో గతంలో అనేక కార్యక్రమాలు పోరాటాలు నిర్వహించడం జరిగింది. అనేక ప్రజాప్రతినిధులతోనూ, ప్రజా సంఘాల నాయకులను కూడా కలిసి అర్జీలు ఇవ్వడం జరిగింది. జిల్లాలో అనేక చోట్లసదస్సులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మరియు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రెండు కూడా ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఆర్భాటంగా శంకుస్థాపనలు చేయడం తప్ప ఫ్యాక్టరీ కోసం నిధులు కేటాయించింది లేదు పూర్తి చేసింది లేదు మూడు సంవత్సరాల్లో చేస్తామని కోతలు కోయడం తప్ప చేసిందేమీ లేదు. ఈనెల తొమ్మిదో తారీఖు నుండి భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు కడపలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించాలని డిమాండ్తో కన్నెతీర్థం నుండి కడప కలెక్టరేట్ వరకు చేస్తున్న పాదయాత్రలో ఉక్కు ఐక్యవేదిక నాయకులందరూ పాల్గొని తమ సంపూర్ణ మద్దతును ఇస్తున్నారు.