కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు మరోసారి అరుదైన గౌరవం దక్కింది. ఫోర్బ్స్ విడుదల చేసిన ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన 100 మంది మహిళల జాబితాలో మరోసారి చోటు సాధించారు. ఫోర్బ్స్ ప్రకారం, ఈ జాబితా పరపతి, మీడియా, ప్రభావం మరియు ప్రభావ రంగాలపై ఆధారపడి ఉంటుంది. ఆ జాబితాలో దేశంలో మొత్తం ఆరుగురికి చోటు దక్కగా, వారిలో నిర్మలమ్మ ప్రథమ స్థానంలో నిలిచింది. ఆమెతో పాటు బయోకాన్ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ కిరణ్ మజుందార్ షా, నైకా ఫౌండర్ ఫల్గుణి నాయర్, హెచ్‌సీఎల్ చైర్పర్సన్ రోష్నీ నాదర్ మల్హోత్రా, సెబీ చైర్పర్సన్ మాధబీ పూరీ బాచ్, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్పర్సన్ సోమా మోండల్‌లు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు.