గుంతకల్లు పట్టణంలోని రైల్వే డీజల్ షెడ్డు, కేంద్రీయ విద్యాలయం తదితర ప్రాంతాల్లో చిరుతపులి సంచరిస్తున్న ట్లు జరుగుతున్న ప్రచారం దుష్ప్ర చారమని ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ హెచ్. కరిముల్లా, గుంతకల్లు బీట్ ఆఫీసర్ పి. రాజేశ్వరి చెప్పారు. గుంత కల్లు రైల్వే డీజల్ షెడ్డు తదితర ప్రాంతాల్లో చిరుత పులి సంచరిస్తు న్నట్లు ప్రచారం జరుగుతున్న నేప థ్యంలో బుధవారం రాత్రి ఫారెస్ట్ అధికారులు ఆయా ప్రాంతాల్లో సోదాలు చేశారు. షోషల్ మీడియా లో గుంతకల్లులో పులి సంచారం ఉన్నట్లు అసత్య ప్రచారాలు చేస్తు న్నారని అలాంటివి ప్రజలు నమ్మ రాదని తెలిపారు. ప్రజలను భయాం దోళనకు గురిచేసే అసత్య ప్రచారాలు చేస్తే అలాంటి వారిపై కేసులు నమో దు చేస్తామని వారు హెచ్చరించారు. అన్ని ప్రాంతాలను పరిశీలించామని చిరుత పులి సంచారం ఉన్నట్లు తమకు ఎలాంటి ఆనవాళ్లు కనిపించ లేదన్నారు. ఈ లాంటి దుష్ప్రచారం ప్రజలు నమ్మి భయాందోళన చెంద రాదని సూచించారు.