కలబంద సాగుతో మంచి ఆదాయం పొందవచ్చని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. కలబంద వంటి ఔషధ మొక్కకు మార్కెట్ లో డిమాండ్ ఎక్కువగా ఉంది. ఔషధాల తయారీతో పాటు, సౌందర్య సాధనాల తయారీలో దీనిని ఉపయోగిస్తున్నారు. నీటి స్తబ్దత ఎక్కువగా లేని ప్రదేశాల్లో మాత్రమే కలబందను సాగు చేయాలి. ఇసుక నేల సాగుకు చాలా మంచిదని భావిస్తారు. మొక్కల మధ్య కనీసం 2 అడుగులు దూరం ఉండాలి. ఏడాది పొడవునా కలబంద దిగుబడి బాగుంటుంది.
ఎకరం పొలంలో కనీసం 12,000 కలబంద మొక్కల్ని నాటవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఒక మొక్కకు కనీసం రూ.4 ఖర్చవుతుంది. కలబంద సాగు ప్రారంభానికి కనీసం రూ.40 నుంచి రూ.50 వేలు ఖర్చవుతుంది. మీరు ఒక చెట్టును రూ.10 వరకు అమ్మవచ్చు. మొత్తం రూ.1.20 లక్షల వరకు సంపాదించొచ్చు. ఒక పంట నుండి రూ.80 వేల లాభం పొందుతారు.