హిమాచల్ ప్రదేశ్‌లో బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య హోరా హోరీ పోరు సాగుతోంది. మొత్తం 68 స్థానాలకు గానూ.. రెండు పార్టీలు కూడా 30పై స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. అధికారం సాధించాలంటే.. 35 స్థానాల మెజారిటీ మార్క్‌ను అధిగమించాల్సి ఉంటుంది. పోటీ గట్టిగా ఉండటంతో ప్రలోభాలకు తెరలేపే ఉంది. దీంతో ఎమ్మెల్యేలను కాపాడుకునే పనిలో కాంగ్రెస్ పార్టీ ఉంది. తమ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను రాజస్తాన్‌కు తరలించాలని ఆలోచనలో ఉంది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా పరిస్థితిని స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.