ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్ల కోటాలో మార్పులు చేయబోమని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను సుప్రీంకోర్టు సమర్థించిన నేపథ్యంలో రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని సడలిస్తారా? వెనుకబడిన తరగతులకు 27శాతానికి మించి రిజర్వేషన్లు కల్పిస్తారా అని పార్లమెంట్ లో ఎంపీలు అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి ప్రతిమా బౌమిక్ బదులిచ్చారు. రిజర్వేషన్లపై ఉన్న 50శాతం పరిమితిని పెంచాలని రాష్ట్రాలు ఇటీవల కేంద్రాన్ని కోరుతున్న సంగతి తెలిసిందే.