కేంద్రం ఇస్తున్న నిధులను పక్కదారి పట్టిస్తున్నారని ఏపీలోని వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి విమర్శలు గుప్పించారు. కేంద్ర నిధులతో జేబులు నింపుకోకుండా ప్రజలకు ఉపయోగించాలని హితవు పలికారు. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ అనేది ముగిసిపోయిన అంశమని ఆమె స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీకి స్పెషల్ స్టేటస్ వచ్చే అవకాశమే లేదని చెప్పారు. రాష్ట్రాలకు ఇచ్చే ఆదాయాన్ని కేంద్ర ప్రభుత్వం గణనీయంగా పెంచిందని తెలిపారు. గతంలో రాష్ట్రాలకు 32 శాతం ఇచ్చే వారని... ప్రస్తుతం ఆ మొత్తాన్ని కేంద్రం 42 శాతానికి పెంచిందని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజీకి గత ముఖ్యమంత్రి అంగీకరించారని తెలిపారు.