పవన్ కళ్యాణ్ ఎన్నికల కోసం వారాహి అనే వాహనాన్ని సిద్ధం చేసుకున్న విషయం తెలిసిందే. దీనిపై వైసీపీ చేస్తున్న విమర్శలపై పవన్ కల్యాణ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. 'తొలుత మీరు నా సినిమాలు ఆపేశారు. విశాఖపట్నంలో నన్ను వాహనం నుండి, హోటల్ నుండి బయటకు రానీయలేదు. విశాఖ నుండి వెళ్లిపోవాలని బలవంతం చేశారు. మంగళగిరిలో నా కారును బయటికి రానివ్వలేదు, నన్ను నడవడానికి కూడా అనుమతించలేదు. ఇప్పుడు నా వాహనం రంగు మీకు సమస్యగా మారింది. సరే నేను ఇప్పుడు ఊపిరి పీల్చుకోవడం మానేయాలా? తర్వాత..' అని పవన్ ట్వీట్ చేశారు.