``బూత్ కమిటీ నుంచి బలమైన నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయాలన్నదే మన లక్ష్యం. నెట్‌వర్క్ బలంగా ఉండడం వల్ల గెలుపు చాలా సులభం అవుతుంది. ప్రతి ఎమ్మెల్యేను గెలిపించాలన్నదే పరిశీలకుల లక్ష్యం కావాలి. 175కు 175 గెలవాలి. ఈ నెట్‌వర్క్ మొత్తాన్ని బలంగా పని చేయించాల్సిన బాధ్యత పార్టీ పరిశీలకులందరి మీదా ఉంటుంది. మనం ఎంత కష్టపడతామో అంత ఫలితం ఉంటుంది. మన ఎమ్మెల్యేలను గెలిపించుకుని వచ్చినప్పుడు కచ్చితంగా పార్టీ నుంచి మీకు తప్పక గుర్తింపు ఉంటుంది. ఇది మీకు అవకాశమే కాదు ఒక బాధ్యత కూడా`` అని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. వైయస్సార్‌సీపీ ప్రాంతీయ సమన్వయకర్తలు, జిల్లాల అధ్యక్షులు, నియోజకవర్గాల పరిశీలకులతో తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్ జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ నేతలతో సీఎం చర్చించారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, కమిటీలు, భవిష్యత్ కార్యాచరణపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు.