వైసీపీ అధికారంలోకి వచ్చాక అభివృద్ధి ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న విధంగా మారిపోయిందని అనంతపురం మాజీ జడ్పీటీసీ వేణుగోపాల్ పేర్కొన్నారు. గురువారం మండలంలోని పాపంపేట గ్రామంలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈకార్యక్రమానికి వేణుగోపాల్‌తో పాటు, మండల ప్రధాన కార్యదర్శి పామురాయి రఘు హాజరయ్యారు. వారు మాట్లాడుతూ గ్రామాల్లో గత ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి పనులు తప్ప ప్రస్తుతం జరిగిన పనులను వేళ్లమీద లెక్కపెట్టవచ్చునన్నారు. కార్యక్రమంలో నాగభూషణం, లింగయ్యయాదవ్, కుమ్మర రామాంజినేయులు, పేరంహరి, బాబుప్రసాద్, బాషా, రత్నమోహన, దస్తగిరి, షఫీ, లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు.