ఇంటి పైకప్పు మీద సౌర విద్యుత్ పలకల యూనిట్ ఏర్పాటుకు సంబంధించిన రాయితీ గడువును 2026 మార్చి 31 వరకూ పొడిగిస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. అప్పటివరకూ సోలార్ ఇన్ స్టాలేషన్ కోసం ఎలాంటి అదనపు ఛార్జీలూ చెల్లించాల్సిన అవసరం లేదని వినియోగదారులకు సూచించింది. అదనపు ఛార్జీలు ఎవరైనా డిమాండ్ చేస్తే rts-mnre@gov.in ద్వారా మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేయాలని తెలిపింది. ఒక కిలోవాట్ కు రూ.14,588 చొప్పున 3 కిలోవాట్ల వరకూ రాయితీ ఇస్తారు. రూఫ్ టాప్ సోలార్ కోసం ఈ ఏడాది జులైలో ప్రధాని మోదీ ప్రత్యేక పోర్టల్ ప్రారంభించారు.