కాంగ్రెస్ పార్టీ మీడియా చైర్మన్ పదవికి డాక్టర్ ఎన్ తులసిరెడ్డి రాజానామా చేశారు. ఆ మేరకు విజయవాడలో శుక్రవారం పీసీసీ అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన గిడుగు రుర్రరాజుకు ఆయన రాజీనామా పత్రం అందజేశారు. సుదీర్ఘ రాజకీయ ప్రస్తానంలో తులసిరెడ్డి వివిధ పార్టీలో అనేక పదవులు అనుభవించారు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడటం తులసి రెడ్డి నైజరం, అంతేకాదు అధికారపక్షంలో విమర్శలు ఎక్కుపెట్టడంలో ఆయనకు ఆయనే సాటి అని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నారు. వైసీపీ అధికారం చేపట్టిన తర్వాత కూడా ఆయన విమర్శలను గుప్పించడంలో ఏ మాత్రం తగ్గలేదు. ప్రభుత్వ లొసుగులు, అసమర్థత, ప్రజా వ్యతిరేక విధానా లపై విమర్శలకే అధిక ప్రాధాన్యతనిచ్చారు. కాంగ్రెస్పార్టీకి వెన్నుదన్నుగా ఉంటూ వచ్చిన తులసిరెడ్డి మీడియా చైర్మన్ పదవికి రాజీనామా చేయడం ఆ పార్టీ శ్రేణులను ఆందోళనకు గురిచేసింది. తులసిరెడ్డి మాట్లాడుతూ తాను కాంగ్రెస్పార్టీకి సామాన్య కార్యకర్తగానే కొనసాగుతానన్నారు. ఎవ్వరిపైనా లేదా పార్టీపైనా ఎలాంటి ధ్వేషం అసూయ లేదన్నారు. ఇక నుంచి సామాన్య కార్యకర్తగానే పార్టీకి సేవలందిస్తానని పేర్కొన్నారు.