ప్రధానమంత్రి గతిశక్తి కింద ఆంధ్రప్రదేశ్‌కు రూ. 202 కోట్లు కేటాయించినట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి సోం ప్రకాష్ తెలిపారు. రాజ్యసభలో శుక్రవారం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి రాతపూర్వకంగా బదులిచ్చారు. రూ.5 వేల కోట్ల వ్యయంతో రూపొందించిన ప్రధానమంత్రి గతిశక్తి పథకం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ.202 కోట్లు కేటాయించినట్లు కేంద్రమంత్రి చెప్పారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం రాష్ట్రాలకు స్పెషల్ అసిస్టెన్స్ ఫర్ కేపిటల్ ఇవెస్టిమెంట్ స్కీం కింద రాష్ట్రాలకు వడ్డీ లేకుండా దీర్ఘకాలిక రుణాల మంజూరుకు లక్ష కోట్ల రూపాయలు అదనంగా కేటాయించినట్లు ఆయన తెలిపారు.