ఒడిశా గంజాం జిల్లాకు చెందిన సీహెచ్ నాగేషు పాత్రో అనే 30 ఏళ్ల యువకుడు టీచర్ గా ఉంటూ పార్ట్ టైం రైల్వే కూలీగా చేరారు. అలా వచ్చిన రూ.12 వేలను ఆయన పేద విద్యార్థుల చదువు కోసం వినియోగిస్తున్నారు. బెర్హంపూర్ వర్శిటీలో పీజీ చేసిన ఈయన కరోనా టైంలో ఉద్యోగం కోల్పోయి పిల్లలకు ట్యూషన్లు చెప్పేవారు. అదే స్ఫూర్తితో ఓ కోచింగ్ సెంటర్ స్థాపించి అందులో వేరే ఉపాధ్యాయులను నియమించి పేద విద్యార్థులకు ట్యూషన్స్ చెబుతున్నారు. తనలాగా ఎవరూ ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఇలా సాయం చేస్తున్నట్లు నాగేష్ పాత్రో చెప్పారు.