మాండుస్ తుఫాను ఏపీ పై తీవ్ర ప్రభావం చూపుతుంది. దీని ప్రభావంతో తిరుమలలో భారీ వర్షం కురుస్తుంది. దీంతో టీటీడి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. తిరుమల రెండు ఘాట్ రోడ్లలో ద్విచక్రవాహనాల రాకపోకలను నిలిపివేసింది. అంతేకాకుండా పాపవినాశనం, శిలాతోరణం మార్గాలను మూసివేసింది. ముందస్తు చర్యల్లో భాగంగా క్రేన్లు, ఆటో క్లీనింగ్ వాహనాలను సిద్ధం చేసి ఉంచింది. మరో వైపు భారీ వర్షం కారణంగా శ్రీవారి మెట్టు మార్గంలోకి నీరు వచ్చాయి. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.