ఏపీ లోని గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం ఇకపై నెలకు రూ.200 చెల్లించనుంది. సచివాలయ ఉద్యోగులు న్యూస్ పేపర్ కొనుగోలు చేసేందుకు రూ.200 చెల్లించనుంది. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ఉద్యోగులకు అవగాహన కలిగేందుకు విస్తృత సర్క్యూలేషన్ కలిగిన పేపర్ అవసరమని ప్రభుత్వం తెలిపింది. దీనికోసం 4 నెలలకు రూ.10.44 కోట్లను కేటాయించింది. కాగా, ఇప్పటికే 2.61 లక్షల మంది వాలంటీర్లకు పేపర్ కొనుగోలు కోసం నెలకు రూ.200 ఇస్తుండగా, ఇకనుంచి 1.26 లక్షల మంది సచివాలయ ఉద్యోగులకూ చెల్లించనుంది.