డిజిటల్ భారత్ లో పాలుపంచుకుంటున్న స్టార్టప్ కంపెనీలకు శాంసంగ్ కంపెనీ అదిరిపోయే ఆఫర్ ఇచ్చింది. ఆయా స్టార్టప్ కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకోనున్నట్లు తెలిపింది. యూపీఐ, డిజిలాకర్, ఓపెన్ నెట్ వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్, ఓపెన్ క్రెడిట్ ఎనేబుల్ మెంట్ నెట్ వర్క్, యూనిఫైడ్ హెల్త్ ఇంటర్ ఫేస్ వంటి సాంకేతికతలపై కలిసి పనిచేసేందుకు స్టార్టప్స్ ను ఆహ్వానించింది. ఇందులో భాగంగా వాలెట్, హెల్త్, ఫిట్ నెస్ వంటి డొమైన్లలో భారత్ లోని శామ్ సంగ్ పరిశోధన కేంద్రాలు స్టార్టప్ లతో భాగస్వాములవుతాయి. అవసరమైతే నిధులనూ సమకూరుస్తారు.