ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్, అధికార ఆప్ మధ్య వివాదం మరింత ముదురుతోంది. డైలాగ్ అండ్ డెవలప్ మెంట్ కమిషన్ ఆఫ్ ఇండియా వైస్ ఛైర్మన్ జాస్మిన్ షాపై ఎల్జీ వీకే సక్సేనా విధించిన ఆంక్షలను రీకాల్ చేయాలని ప్లానింగ్ డిపార్ట్ మెంట్ ను ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆదేశించారు. జాస్మిన్ షా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని పేర్కొంటూ ఆయన విధులు నిర్వర్తించకుండా ఎల్జీ ఆదేశాలిచ్చారు. అయితే ఇది న్యాయబద్దంగా చెల్లదని కేజ్రీవాల్ తాజాగా ఆదేశించారు. గతంలో మాదిరిగానే డీడీసీడీ సాధారణ పని తీరు కొనసాగాలని పేర్కొన్నారు.