కాజీపేట మండలం ముత్తులూరుపాడు గ్రామానికి చెందిన పలువురు అయ్యప్ప స్వాములు శనివారం శబరిమలైకు బయలు దేరారు. 41 రోజుల దీక్షల అనంతరం గ్రామంలోని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వాములకు ఇరుముడి కట్టారు. ఈ కార్యక్రమంలో ఎం ఎస్ పి నాయకులు జయరాం మాదిగ కుమారుడు అయ్యప్ప మాల ధరించి శబరిమలై వెళుతున్న సందర్భంగా యంయస్పి నాయకులు మరియన్న మాదిగ, చాట్ల గంగరాజు మాదిగ, మండల ఎంఆర్పిఎస్ ఇంచార్జి చాట్ల భాస్కర్ మాదిగ, ఎం ఈ ఎఫ్ రాష్ట్ర నాయకులు జ్వానేష్ మాదిగ హాజరై అయ్యప్ప స్వామికి పూలమాలతో ఘనంగా సన్మానించి యాత్ర సుఖపదంగా సాగాలని ప్రార్ధించారు. ఈ సందర్భంగా అయ్యప్పస్వామికి ముడుపులు చెల్లించేందుకు పలువురు భక్తులు స్వాములకు కానుకలు ఇచ్చారు. అనంతరం ప్రత్యేక బస్సు లలో శబరికి తరలివెళ్లారు.