తెలుగుదేశం పార్టీలో చురుగ్గా పనిచేస్తూ జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడుగా సేవలందించిన బలగ నాగేశ్వరరావు మృతి తీరని లోటని తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గం అధ్యక్షులు కూన రవికుమార్ అన్నారు. శనివారం నరసన్నపేట లోని ఇందిరనగర్ కాలనీలో నివాసం ఉంటున్న బలగ నాగేశ్వరరావు కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ ఒక న్యాయవాదిగా పనిచేస్తూ తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి ఎనలేని సేవలు అందించారని అన్నారు. ఈ కార్యక్రమంలో నరసన్నపేట తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.