ఏఐఎస్ఎఫ్ కాశిబుగ్గ సమితి ఆధ్వర్యంలో కాశీబుగ్గలో ఉండే కొన్ని కళాశాలలు ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా రెండో శనివారం క్లాసులు నిర్వహిస్తున్న యాజమాన్యాలతో మాట్లాడి, కళాశాల తరగతులను అడ్డుకొని విద్యార్థులను బయటకు పంపించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు సిహెచ్ రవి మాట్లాడుతూ విద్యార్థులపై ఒత్తిడి తెస్తూ, సెలవు రోజు కూడా విద్యార్థులకు క్లాసులు నిర్వహిస్తూ వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. విద్యార్థులకు ఒత్తిడి చేస్తున్న యాజమాన్యాలపై విద్యాశాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోపోవడం అన్యాయమని అన్నారు. ఇప్పటికైనా విద్యాశాఖ స్పందించి ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా నడుపుతున్న కాలేజ్ పై చర్యలు తీసుకోవాలంటూ ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు సిహెచ్ రవి పలాస కాశీబుగ్గ సమితి సభ్యులు జే రాజు , భరత్ , పవన్, హరీష్ తదితరులు పాల్గొన్నారు.